వెయిట్ ట్రైనింగ్ వ్యాయామం అమ్మాయిలకు చక్కని శరీర ఆకృతిని ఇస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్.నటి సమంత వంద కిలోల బరువుతో స్క్వాట్స్ చేస్తున్న వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. సెక్సీయస్ట్ విమెన్ గా కౌట్ అప్టన్ అయితే 20 పౌండ్లతో స్లెడ్ వ్యాయామాలు చేసింది. మంచి శరీరాకృతి కోసం ఇలాంటి వ్యాయామాలు చేస్తే శరీరం అదనపు ఆక్సిజన్ తీసుకుని కేలరీలు అధికంగా ఖర్చు ఐపోయి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలో కొవ్వు శాతం తగ్గి ఆ మేరకు నాజూకు కండరాలు వృద్ధిచెందుతాయి. ఆహారంలో కేలరీలు వెంటనే కరుగుతాయి. హోవార్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం ప్రకారం మధుమేహం, గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

Leave a comment