నిహారికా,

నువ్వు ఎక్కువగా ఎవరితో టచ్ లో వుంటావంటే ఫేస్ బుక్ అన్నావు. ఫేస్ బుక్ అంటే అందరికీ ఇష్టం. అందులో ఫ్రెండ్ రిక్వెస్ట్ లోనే స్నేహం మొదలవుతుంది. ముక్కు, మొహం తెలియని వాళ్ళు కూడా ప్రతి రోజూ పలకరించుకుంటూ ఆత్మీయులైపోతారు. అసలా కాన్సెప్ట్ క్లిక్ అవటానికి ముఖ్య కారణం స్నేహం అనే రెండక్షరాలు. అలాటి స్నేహాన్ని నిర్వచించడం కష్టం. మన జీవితం చుట్టూ ఎన్నెన్నో స్నేహ పరిమళాలు. ఎన్నెన్నో భావాలు, ఎన్నెన్నో మాటలు ఎప్పుడూ స్నేహితుల మధ్యనే ఇన్నీ భాధవ్యాలు నడుస్తాయి. మనం పుట్టేసరికి బంధువులు మనలో ఉంటారు. కానీ స్నేహితులను మనం ఎంచుకుంటాం. మన తోబుట్టువుల్లా వాళ్ళని భావిస్తాం. వాళ్ళ దగ్గర బంధువులతో వుండే పాటి జాగ్రత్త కూడా అవసరం లేదు. సంతోషంగా, స్వేచ్చగా, ఓపెన్ గా వుంటాం. మన సంతోషం అంతా స్నేహం చుట్టూనే ఉంటుంది. మన స్నేహితులతో మనం నిస్సంకోచంగా అన్నీ విషయాలు చర్చిస్తాము గనుక మన మనసు వారి మనసు వారి ముందు పరచినట్లే. మనలోని నైపుణ్యాలు గురించి జీవితంలోని సమతుల్యాన్ని నిర్వహించడాన్ని మన స్నేహితులే చేయాలి. అందుకే స్నేహితులు కావలి అందుకే స్నేహం స్నేహం లోనే జీవితం చిగురిస్తుంది. ఆరోగ్యంగా ఎదుగుతుంది.

Leave a comment