వర్షల్లో,రాబోయే చలి రోజులకు సూప్స్ మంచి ఎంపిక . ఈ రోజుల్లో సూప్స్ లో విస్తృత శ్రేణిలో క్వాన్ట్ , వ్యాక్యూమ్ రకాలున్నాయి. టమోటో,చికెన్,న్యూడిల్ ,క్రీమ్స్ వంటి రెగ్యులర్ రకాలు ఎంచుకోవచ్చు అయితే వీటిలో ఎంతో ఎక్కువ శాతం లో సోడియం వుంటుంది ఓ క్యాప్ వెజిటబుల్ సూప్ లో 900 మిల్లీ గ్రాముల సోడియం వుంటుంది. అంటే రోజుకు సిఫార్స్ చేసిన 1500 మిల్లీ గ్రాముల్లో ఇది సగం కంటే ఎక్కువ. బీన్స్ సూప్ లో అయితే ఇతర వెజిటబుల్ సూప్స్ లాగా కాకుండా క్యానింగ్ ప్రక్రియలో రుచి టెక్చర్ పోకుండా వుంటాయి. టేబుల్ పైన సర్వింగ్ సైజ్ చూసుకోవాలి . ఒకసారి పాకెట్ లో రెండు సర్వింగ్ లో కలిసి వుంటాయి. లైట్ సూప్స్ అని రాసివుంటాయి. కానీ వాటిలోనూ సోడియం ఎక్కువే. సాధ్యమైనంత వరకు ఇంట్లో తయారు చేసినవి తీసుకుంటే మేలు. యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు ఉంటాయి. చూసి నేర్చుకోవచ్చు.

Leave a comment