నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ తాజా పరిశోధన ప్రకారం నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల గుండెజబ్బుల ప్రమాదం తక్కువ. అంతేకాదు ద్రవపదార్థాలు ముఖ్యంగా నీళ్లు ఎక్కువ తాగే వాళ్లలో శరీర అవయవాలన్నీ సక్రమంగా పని చేయడంతో పాటు భవిష్యత్తులో గుండె జబ్బులు రావు అంటున్నారు. ఉప్పు తక్కువగా తీసుకుంటూ నీటిని ఎక్కువ తాగే వాళ్ళు శరీరం లో సోడియం శాతం తక్కువగా ఉందనీ  ఫలితంగా గుండె సమస్యలు తక్కువగా ఉన్నాయని తేల్చారు. నీళ్లు తక్కువగా తాగితే శరీరం డీహైడ్రేషన్ కు గురి అవ్వటం తో పాటు కార్టియార్ ఫైబ్రోసిస్ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది ప్లాస్మా లో సోడియం శాతం కూడా పెరగటం ఇందుకు ఇంకో కారణం అంటున్నారు. సోడియం శాతం గమనించుకోమని నీళ్లు తాగమని సూచిస్తున్నారు పరిశోధకులు.

Leave a comment