పాదాలు మృదువుగా కనిపించాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి గోరువెచ్చని పాలలో రెండు చుక్కలు ఆల్మండ్ ఆయిల్ కలిపి ఆ పాలతో పాదాలు మునిగేలా ఉంచితే పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ పాదాలను మృదువుగా చేస్తుంది. చర్మం మృదువుగా మార్చేందుకు ఆల్మండ్ కూడా ఉపకరిస్తుంది. ముతక ఉప్పు ఆలివ్ ఆయిల్ పేస్ట్ మాదిరిగా చేసి పాదాలకు మర్దనా చేస్తే మృదువుగా అయిపోతాయి. ప్రతి రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ తో పాదాలు వేళ్ల మధ్య మర్ధన చేయాలి లేదా ఆల్మండ్ ఆయిల్ తో కూడా చేయచ్చు. రాత్రివేళ పగుళ్ళు ఉన్న పాదాలకు యాంటీ ఫంగల్ క్రీమ్ రాసుకుంటే మంచిది.

Leave a comment