వర్షాల్లో వాతావరణం చల్లగా ఉండే సందర్భాల్లో ముఖ చర్మం మృదువుగా ఉండేందుకు గులాబీ నీరు కలిపిన ప్యాక్ తక్షణం ఫలితం ఇస్తుంది అంటున్నారు సౌందర్య నిపుణులు.టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి లో కొద్దిగా గులాబీ నీరు కలిపి పేస్టులా కలపాలి.ఈ ప్యాక్ తో చర్మం మృదువుగా మెరుపుతో ఉంటుంది. అలాగే మూడు టీ స్పూన్ల ఓట్స్ లో టేబుల్ స్పూన్ గులాబీ నీరు టీ స్పూన్ పెరుగు తేనె కలిపి పేస్టులా చేసి ప్యాక్ వేసుకోవచ్చు. టీ స్పూన్ పెసరపిండిలో పసుపు నిమ్మరసం గులాబీ నీరు కలిపిన పేస్ట్ ని ఫేస్ మాస్క్ వేసుకుంటే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే పెసరపిండి గులాబీ నీరు తేనె కలిపిన ఫేస్ ప్యాక్ కూడా మంచి ఫలితం ఇస్తుంది.

Leave a comment