మనలో చాలా మందికి సొంత వైద్యాల పైన చాలా నమ్మకం. పిల్లల విషయంలో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలు చేస్తారు కూడా. ఉదాహరణకు పిల్లవాడికి కళ్ళు ఎర్రగా ఉంటే నిద్రలేక అంటారు. చమ చాలు పోస్ట్ తగ్గుతుందంటారు. కానీ వైరస్ దానికి కారణం కావచ్చు. అలాగే ఐదారేళ్ళ పిల్లలు పుస్తకాలూ పట్టుకున్న పది నిమిషాలకే పక్కన పెట్టేస్తే మాయోపియా హైపర్ మయోపియా ఆష్టిష్  ,మాటిజం వంటి సమస్య ఉండొచ్చు. పిల్లాడు  టీవీ దగ్గరగా చూస్తుంటే అస్తమానం అదో  పాడలవాటు  టీవీ  ని వదులడు  అంటారు. అంతే కానీ వాడికి చూపులో ఎదో లోపం వుంది కనుక అలా  టీవీ దగ్గరగా చూస్తున్నాడని ఎంత మాత్రం అనుమానించరు. మరీ గ్రామాల్లో పిలల్లు మెల్ల కన్నుతో పుట్టినా అదృష్టమని సంతోషించి ఊరుకుంటారు అది అదృష్టం కానే కాదు. వైద్య పరిభాషలో స్కింట్ అంటారు. చిన్న వయసులోనే చిన్నపాటి శస్త్ర  చికిత్సతో సరిచేయచ్చు. తల్లికి మధుమేహం ఉన్న బిడ్డకు కంటి సమస్య లొస్తాయి. ఇవన్నీ డాక్టర్ పరిష్కారించవలిసిన విషయాలు .

Leave a comment