శరీరంలో ఎక్కడ ఏ అసౌకర్యం  ఉన్నా ఏ చిన్న నొప్పి వచ్చినా చాలా మంది సొంత వైద్యమే చేసేసుకుంటారు. మెడికల్ షాపుకు వెళ్లి తెలిసిన మాత్ర కొనేసి లేదా షాపతను సజెస్ట్ చేసిన మాత్రను మింగేస్తారు. మన దేశంలో ప్రిస్కిప్షన్ లేకుండా మందులు అమ్మేయటం ఈ ధోరణికి మరింత దోహదం చేస్తోంది.  కానీ ప్రతి మాత్రకు ఇతర ప్రభావాలుంటాయి. సొంత వైద్యంతో ఈ లక్షణాలకు మందు పడుతుంది. కానీ శరీరంలో లో  వచ్చిన వ్యాధికి కాదు. తల నొప్పి  కడుపు నొప్పికి లేదా ఏదైనా చిన్న సమస్యకు రెగ్యులర్ సొంత వైద్యం మొదలు పెడితే ఆ డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోతారు ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ స్లీపింగ్ పిల్స్ యాంటాసిడ్స్ విటమిన్లు ఇలాంటివి ఈ కోవా లోకి వస్తాయి. కొన్ని రకాల మందులకు ఎలక్ట్రిక్ రియాక్షన్లు ఉంటాయి. తరచూ వాడటం వల్ల  ఓవర్ డోసేజ్ అయిపోతాయి. రోగ నిరోధక వ్యవస్థ ప్రభావితం అవుతోంది. చాలాసార్లు ఒక డ్రగ్  మరో డ్రగ్ తో రియాక్ట్ కావచ్చు. గర్భిణులు డయాబెటిక్ పేషంట్లు సొంతవైద్యాల వైపుకు అసలు తొంగే చూడవద్దు.వైద్యుల సిఫార్స్ లేకుండా ఎలాపడితే అలా మాత్రలు మింగేస్తుంటే దీర్ఘ కాలంలో ఆ ప్రభావం శరీరం పైన పడుతుంది.

Leave a comment