పెదవుల తడి ఆరిపోయి పగిలిపోయి ఇబ్బందిపెడితే లిప్ బామ్ లు కొంటూ ఉంటాం. కాస్త ఓపిక చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని లిప్ బామ్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె బాదం నూనె రెండు టేబుల్ స్పూన్ల పెట్రోలియం జెల్లీ ఒక టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ పావుకప్పు తాజావి లేదా డ్రై గులాబీ రేకలు ఓ ప్యాన్ లో వేసి సన్నటి సెగతో వేడి చేస్తే మిశ్రమం మౌల్డ్ అవుతుంది. దీన్ని  శానిటైజ్డ్ కంటైనర్ లో పోసి ఓ గంట ఆరనిచ్చి పూరేకులు వడగట్టి బామ్ మిక్స్డ్ గా  వాడుకోవచ్చు. సిట్రస్ లిప్ గ్లాస్ తయారీకైతే రెండు టేబుల్ స్పూన్ల తేనె  వేడి చేసి వాక్స్ కరిగాక బౌల్ లో పోనీ ఐస్ నింపిన ట్రే లో ఉంచాలి. 10,15 చుక్కలు నిమ్మరసం వేస్తె లిప్ గ్లాస్ సిద్ధం అయిపోతుంది. దీనికి పొడిగా ఉన్న కంటైనర్ లో పోసి భద్రం చేసుకోవచ్చు.

Leave a comment