Categories
ఏదైనా అనారోగ్యం రాగానే డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందులు తీసుకొంటాము. డాక్టర్ ప్రతి మందు ఎన్ని రోజుల పాటు ఎంత డోస్ తీపుకోవాలో చెపుతారు. కానీ కాస్త అనారోగ్య లక్షణాలు తగ్గగానే మందులు వాడకం మానేయాటం ,డోస్ తగ్గించటం చేస్తారు కొందరు. ఇది ఎంత మాత్రం సరైన చర్య కాదంటారు డాక్టర్లు.చికిత్స ప్రభావంతంగా ఉండాలంటే వైద్యుల సూచన పాటించాలి. ప్రతి రుగ్మతలకు స్పష్టమైన డోస్ వాడాల్సిన షెడ్యూల్డ్ ఉంటాయి. లక్షణాలు తగ్గాయి కాదా అని మందులు మానేస్తే అనారొగ్యాన్ని పొడిగించుకోవడమే అవుతుంది. మందులు వాడకంలో సొంత నిర్ణయం సమర్థనీయం కాదు.