మాటలు చాలా విలువైనవి. ఆచి తూచి వాడాలంటారు పెద్దలు. హీరోయిన్ల గ్లామర్ దుస్తులపై అనవసరంగా నూరు జారి ఇప్పుడు నాలుక కొరుక్కోబోమంటున్నాడు దర్శకుడు సురాజ్. విశాల్ తమన్నా నటించిన తమిళ సినిమా కత్తి సండై సినిమా ఒకడొచ్చాడు పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళనాట ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్ తమన్నా దుస్తులపై దర్శకుడు సురాజ్ చిట్టి పొట్టి దుస్తులు వేసుకునేందుకే  కధానాయికలకు పారితోషకం ఇస్తామని ప్రేక్షకుల ఆనందం కోసం వళ్ళు  గ్లామరస్ గా  కనిపించాల్సిందేనని  ఆయన అనుచితంగా వ్యాఖ్యలు చేసాడు. తమన్నా నయనతార ఆయన పై విరుచుకుపడటం తో ఆయన క్షమాపణలు చెప్పాడు కానీ వివాదం సర్దుమణగలేదు. ఈ విషయం పై తమన్నా కు ఎంతో మంది సాటి నటులు మద్దతుగా నిలబడ్డారు. లక్ష్మీ ప్రసన్న లావణ్య త్రిపాఠీ కృతీ కర్బందా శాన్వీ రీతూ వర్మ సురాజ్ వ్యాఖ్యల్ని ఖండించారు. రకుల్ ఈ విషయంలో తాజాగా స్పందిస్తూ మేమున్నది నటించేందుకే  మాకీ వృత్తి ఇష్టం. డబ్బే ప్రాధాన్యం అనుకుంటే సంపాదించే మార్గాలు చాలా వున్నాయి. మహిళల్ని గౌరవించటం నేర్చుకోమంది. కధానాయికలే ఏం చేస్తార్లే అనుకున్న సురాజ్ నోటి దురుసును సారీ అన్నా ఊరుకోలేదు హీరోయిన్స్.

Leave a comment