నీహారికా,

స్నేహితులు, బంధువులు, చివరకు  భార్యా భర్తల మధ్యను చిన్ని అపార్ధాలు వస్తూనే ఉంటాయి. వీటిని తెగే దాకా లాగోద్దనే అంటారు పెద్దవాళ్ళు. తప్పు మనదే అయితే వెంటనే సారీ చెప్పేందుకు సిద్ధమై పోవాలి. జరిగిన తప్పు దిద్దుకునే అవకాశం ఇమ్మని అడగాలి. మనం ఎంత బాధపడుతున్నామో అవతలివాళ్ళకు చెప్పాలి. ఒక వేళ మనం బాధపడ్డా ఆ విషయం సూటిగా ఎదుటి వాళ్ళకు అర్ధం అయ్యేలా చెప్పాలి. అంతగా అడిగినా అవతల వాళ్ళు మన్నించక పొతేకాలం అన్ని సమస్యలు పరిష్కారం చూపిస్తుందని వదిలేయాలి. అన్నింటికంటే ముందు అసలు అపార్ధం చేసుకున్న కారణం ఏమిటో అయి దాని పైనే ద్రుష్టి పెట్టాలి. తప్పు ఎవరిదో స్పష్టంగా వుంటుంది. అప్పుడిక నిదారోపణలు, పరస్పర దూషణలు మానేసి సామరస్యంగా కుర్చుని ఏ విషయంలో అపార్ధం చేసుకున్నారో మాట్లాడుకుంటే గొడవే లేదు. కాస్త సంయుమనం తో వ్యవహరించి సమస్య పరిష్కరించు కోవచ్చు.

Leave a comment