Categories
కెనడా నుంచి ఒక మంచి పరిశోధన రిపోర్ట్ వచ్చింది. ఈ పరిశోధనలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా క్షమాపణ చెపుతారని సారీ అని చెప్పటానికి పురుషులు సిద్ధంగా ఉండరని సారాంశం. అంటే ఎప్పుడు స్త్రీలే తప్పులు చేసి సారీ చెపుతారని కాదు, తప్పులు ఎవరైన చేస్తారు కానీ క్షమాపణ చెప్పటానికి నామోషీగా అనుకొంటారు. పొరపాటు చేసిన స్త్రీలు వెంటనే దానిని సరిదిద్దుకొనేందుకు సారీ అని చెప్తారు కానీ మగవాళ్ళు చెప్పరట. పైగా వాళ్ళు తాము తప్పు చేశాము అనుకోరట. ఆ తప్పులో తమవంతు చాలా తక్కవ భాగం ఉందనుకుంటారట. ఆడవాళ్ళు తొందరగా తప్పు ఓప్పేసుకొని సారీ చెప్పి మనసు పైన భారం దించుకొంటారని తేలింది. మంచిదే కదా!