హై హీల్స్ వేసుకోవడం ఇవాల్టీ అమ్మాయిల మొదటి ఇష్టాల్లో మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఎత్తైన చెప్పులు వేసుకోవాలంటే ట్రెండ్ కంటే సౌకర్యం ముఖ్యం అని ముందు వాళ్ళు అర్ధం చేసుకోవాలి. పాదానికి సరిగ్గా సరిపడేవి తీసుకోవాలి. పాదం కంటే చిన్నవయిన పెద్దవయినా అడుగులు తదబడిపోతాయి. కొత్తలో ఒకటి ఒకటిన్నర అంగుళం కంటే ఎత్తువి తీసుకోకూడదు. ముందు కప్పి ఉండే హీల్, వెనక ఆసరా ఉండే బెల్ట్ రకం మోడల్ తీసుకుంటే హై హీల్స్ తో సులువుగా నడవటం వీలవుతుంది. సరిగ్గా నడవాలి అంటే చెప్పు వెనక భాగం అంటే హీల్ నేలకు తాకి ఆ తర్వాత చెప్పు ముందు భాగం నేలకు తాకలి. అప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది. ముందు ఇంట్లో వేసుకుని ప్రాక్టీస్ చేస్తే బయటకు వేసుకుపోయేందుకు ఫ్రీగా ఉంటుంది.

Leave a comment