కొరియన్, జపాన్ మహిళా సౌందర్య రహస్యం వాటర్ ఫేషియల్ తో ఉంటుందంటారు. ఒక గిన్నెలో మంచు ముక్కలు కొన్ని చల్లని నీళ్ళు పోసి అందులో మొహాన్ని ఉంచి తీసి మెత్తని వస్త్రంతో తుడుచుకోవాలి. ఇలా రెండు మూడు సార్లు చేయాలి. అలాగే మంచు ముక్కను నూలు వస్త్రంలో చుట్టి ముఖంపై రుద్దినా చాలు అతి చల్లని నీళ్లు ముఖంపై వుండే మచ్చలు తొలగించి నల్లని వలయాలు తొలగిస్తాయి. జిడ్డు చర్మం పైన ఫేస్ ఫేషియల్ జిడ్డు ను తగ్గించి మొహాన్ని మెరిపిస్తుంది. ఐస్ ఫేషియల్ చేసే ముందుర గోరు వెచ్చని నీటితో మేకప్ పూర్తిగా తుడిచేయాలి. అలాగే మంచు ముక్కతో నేరుగా మొహంపై రుద్దకూడదు. మృదువైన నూలు వస్త్రంలో చుట్టి ఫేషియల్ చేయాలి.

Leave a comment