Categories
ఓట్స్ చాలా ఆరోగ్యం,ఓట్స్ ఇటు శిరోజాలను చర్మాన్ని కూడా మెరిపించగలవు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఓట్స్ లోని పోషకాలు శరీర సౌందర్యానికి ఉపయోగపడతాయి. ఓట్స్ ని కాసేపు నానబెడితే తెల్లని పాలలా అవుతాయి. ఆ పాలలో దూది ముంచి ముఖంపైన అద్దుతూ శుభ్రం చేస్తే సహజమైన క్లెన్సర్ లాగా పని చేస్తాయి. ఓట్స్ ని నానబెట్టి అందులో నిమ్మ రసం ,ఆపిల్ సిడార్ ,వెనిగర్ ఆలీవ్ నూనె కలిపి తలకు పట్టించి కాస్సేపాగి కడిగేస్తే చుండ్రు తగ్గిపోతుంది. ఓట్స్ పొడిని వేడి నీళ్ళలో వేసి కాస్సేపు ఆగి గుజ్జుగా అయినా తర్వాత అందులో కాసిని పాలు ,తేనె వేసి వంటికి పట్టించి ఓ పావుగంట ఆగి స్నానం చేస్తే చర్మం మృదువుగా అందంగా మెరుస్తుంది.