శతాబ్దాలుగా తేనె ఇటు అందం కోసం, ఆరోగ్యం కోసం, శక్తి కోసం వాడుతూనే వున్నారు. సహజమైన మాయిశ్చురైజింగ్ గునాలతో చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచుతూ వయస్సును దాచేసే శక్తి గలిగి వుంటుంది. పొడి చర్మానికి పునరుత్తేజాన్ని ఇస్తుంది. క్యాలరీలు వుండవు. దియామిన్, నియాసిన్, రిబోఫ్లేవిన్, పాంధా ధయానిక్ యాసిడ్ కొన్ని ఎమినో యాసిడ్ల, కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఎన్నో ఖనిజాలు తేనెలో ఉన్నాయి. వర్కవుట్స్ మొదలుపెట్టే ముందర నిమ్మరసం తేనె కలిపి తీసుకుంటే అదనపు శక్తి లభిస్తుంది. తేనెలో వుండే సహజ ప్రక్టోస్ కండరాళ్ళ అలసట రానీయదు. పెదవులపైన రాస్తే పొడి చర్మం అలసట రానీయదు. పెదవులపై రాస్తే పొడిబారడం పగుళ్ళు తగ్గిపోతాయి. విడిగా ఓ స్పూన్ తేనె తింటే టేస్ట్ బడ్స్ సంతృప్తి చెందుతాయి మంచి ఆరోగ్యం సమకూరుతుంది.

Leave a comment