కర్ణాటకలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో శివ గంగ (శివగంగే) ను దక్షిణ కాశి అంటారు భక్తులు.రెండు వేల ఆరు వందల నలభై అడుగుల ఎత్తయిన పర్వతం పైన ఉంటుంది దేవాలయం. ఈ పర్వతంపై గంగాధరేశ్వర స్వామి వేల ఏళ్ళ క్రితం ఈ స్వయంభూవుగా వెలశాడని స్థలపురాణం చెబుతోంది. పార్వతీదేవి హొన్నమ్మ దేవి గా కనిపిస్తుంది.స్వామికి నేతితో అభిషేకం చేస్తారు శివలింగం పైన ఆ నెయ్యి పడగానే వెన్న గా మారి పోవడం కనిపిస్తుంది.వెన్న గా మారిన నెయ్యిలో ఔషధగుణాలు ఉంటాయంటారు.ప్రతియేటా మకర సంక్రాంతి కి సాయంత్రం నందీశ్వరుని కొమ్ములు మీదుగా సూర్యకాంతి శివలింగాన్ని తాకుతోంది.ఇక్కడికి ట్రెక్కింగ్ కోసం ఎంతో మంది వస్తూ ఉంటారు.

Leave a comment