Categories
ముఖం తాజాగా కనిపించేందుకు కాఫీ పొడి పూత వేసుకోండి అంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్.రెండు స్పూన్ల కాఫీ పొడిలో చెంచా బాదం నూనె కాసిన్ని పాలు రెండు స్పూన్ల తేనె వేసి పూతలా వేసుకోవాలి.ఒక పావు గంట ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే ముఖం తాజాగా ఉంటుంది అలాగే రెండు స్పూన్ల కాఫీ పొడిలో తేనె, నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టి ముఖానికి రాసుకుని ఆరనివ్వాలి.బాగా ఆరిపోయాక కొంచెం పంచదార చేతిలోకి తీసుకుని నీళ్లతో చేతులను తడుపుకుంటూ ముఖంపై నెమ్మదిగా రుద్దుతూ వుంటే మృతకణాలు పోయి చర్మం మెరుస్తుంది.