పెళ్లి జీవితంలో ఒకే ఒకసారి వచ్చే ప్రత్యేకమైన పండగ లాంటిది. ఆ రోజు ఎలా ఉండాలో ఇన్విటేషన్ ప్రింటింగ్ నుంచి పెళ్లి కాన్సెప్ట్ ఎవ్వరికీ లేనంత గొప్పగా ఉండాలనుకుంటున్నారు ఆలా అవకాశం సముద్ర గర్భంలో ఏకంగా గాలిలో ఎగిరే బెలూన్ లో కూడా పెళ్లిలవుతున్నాయి . ఇక పెళ్లికూతురు ఎలా ఉండాలి. ప్రధానం రోజు మెహేందీ పండగ రోజు ఏకంగా పెళ్లి రోజు ఆమె అలంకరణ ఆహార్యం ఎంత గొప్పగా ప్రత్యేకంగా ఉండాలి. సంప్రదాయం ఆధునికత కలిసిన డిజైనర్ లుక్ తో అమ్మాయి మెరిసిపోవాలి. ఒక సోయగాల చీర అయి ఉండచ్చు. చీరని అనార్కలీ ఫ్యాషన్ నేలను జారాడే లెహెంగా మోడల్ లో కావచ్చు. లంగా వోణీ కలిపి కొట్టేసి మొత్తంగా బంగారు జరి పనితనం ఉట్టిపడేలా ఎంబ్రాయిడరీ చేసి పెళ్లి దుస్తుల్ని కూడా ఫ్యాషన్ డిజైనర్స్ చేతిలో మంత్రదండం అనే క్రియేటివిటీ తో అద్భుతాల సృష్టిస్తున్నారు. అలాంటి లేత రంగుల ఉషోదయాలు చీకటి వెలుగులు మెరుపులు పట్టు చీరలపై పూర్తీ ఖరీదైన ముత్యాలు రాళ్ల ఎంబ్రాయిడరీ లు ఆన్ లైన్ లో సందడి చేస్తున్నాయి. పెళ్లి స్పెషల్ చీరల పై వీలుంటే ఓ లుక్ వేయండి.
Categories