ఆహారం గబగబ తినేస్తే బరువు పెరుగుతారు అంటున్నాయి అధ్యయనాలు. ఆహారాన్ని త్వరత్వరగా తినే వారి కంటే నెమ్మదిగా తినేవారు తక్కువ బరువు పెరుగుతారని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలా స్పీడ్ గా తింటే ఎక్కువ క్యాలరీలు శరీరంలోకి వెళ్లి పోతాయి. కడుపు నిండిందనే భావం, ఉదరం లోంచి మెదడులోకి చేరే సరికి ఎక్కువ ఆహారం కడుపులోకి వెళ్ళిపోయే కారణంగా బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. ఆహారం తినే సమయంలో మెదదులోకి సంకేతాలు వెళతాయి. కడుపు నిండినట్లు  అనిపించగానే తినటం ఆపేస్తారు. కనుక బరువు తగ్గులను కానీవాళ్ళు, పెరగ కూడదని భావించే వారు కూడా ఆహారాన్ని నెమ్మదిగానే తినాలని సూచిస్తున్నారు.

Leave a comment