సర్పంచిగా ఎన్నికైన ఓర్వ కల్లుకు చెందిన తోట అనూష దక్షిణ భారతదేశం నుంచి రోలర్ హాకీ బృందానికి దేశం తరఫున ప్రాతినిథ్యం వహించిన తొలి మహిళ కాళ్లకు స్కెట్స్ కట్టుకుని చేతిలో హాకీ కర్రలు వేగంగా కదులుతూ గోల్ చేయటాన్ని రోలర్ హాకీ అంటారు. ఇప్పటికే 14 జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పథకాలు ఎన్నో అందుకొన్నారు. 2004 లో జర్మనీలో జరిగిన ఏడవ ప్రపంచ మహిళా వరల్డ్ కప్ పోటీల్లో పాల్గొని సత్తా చాటారు అనూష. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీటెక్ చదివారు సర్పంచ్ గా ఎన్నికైన అనూష పిల్లల కోసం క్రీడా కేంద్రాన్ని సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తానంటున్నారు.