ఎంత ఖరీదైన సబ్బులు,సౌందర్యఉత్పత్తులు వాడుతున్న వాటిలో రసాయనాలు తప్పనిసరి . అందుకే పసుపు,చందనం ,పాలు వంటివి వాడటం లేటెస్ట్ ట్రెండ్ . చందనం క్రమం తప్పకుండా వాడితే బాక్టీరియా అడ్డుకొంటుంది ట్యాన్ పోతుంది . పసుపు మచ్చలు పోగొట్టి హానికర బాక్టీరియా వ్యాపించ కుండా చేస్తుంది . కలబంద ఒక లేయర్ లాగా చర్మంపైన పరుచుకొని తేమను కాపాడుతుంది . దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి . కుంకుమ పూవ్వు లోని విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని పొడిబార నివ్వదు చర్మం మృదువుగా ఉంటుంది . బాదంపాలు చర్మం కమిలి పోకుండా కాపాడతాయి . ఇవన్నీ సౌందర్య ఉత్పత్తుల్లో ఉంటాయి . కానీ వాటిలో ఉపయోగించి ఇతర రసాయనాల వల్ల చర్మం పాడవుతూ ఉంటుంది .

Leave a comment