ఇంట్లో పసి పిల్లలుంటే పిల్లలకు పెట్టే భోజనం ,రాసే క్రీమ్స్ ,ఆయిల్స్ బట్టలపైన మరకలు పడతాయి. బేబీ ఫుడ్ పడి మరకలు పడ్డ వస్త్రాలు చల్లని నీటిలో పావుగంట సేపు ఉంచాలి. నీరు ఆల్కహాల్ సమపాళ్ళలో తీసుకొని మరకలపై రబ్ చేయాలి. దీనితో మరకపోతుంది లేదా వైట్ వెనిగర్ నీరు సమపాళ్ళలో తీసుకొని ఆ మరకలు పడ్డ చోట తడిపి నానబెట్టి వాష్ చేయాలి. బేబీ ఆయిల్స్ ,క్రీమ్స్ పైన టాల్కం పౌడర్ చల్లితే బట్టలపైన నూనె పీల్చుకొంటుంది. పది నిమిషాల తర్వాత స్పూన్ తో స్క్రాప్ చేయాలి. అ తర్వాత స్టెయిన్ రిమువర్ తో వాష్ చేస్తే మరకలు పోతాయి. బ్రెస్ట్ మిల్క్ మరకలు గోరువెచ్చని నీళ్ళలో నాననిచ్చి స్టైయిన్ రిమువర్ వాడి వాష్ చేస్తే పోతాయి.

Leave a comment