నీహారికా,

మనం ప్రతి రోజు ఎక్కువసమయం గడిపేదో ఆఫీసులోనే. ఇక్కడ తోటి ఉద్యోగులతో సామరస్యంగా కలిసి పోక పొతే చాలా సమస్యలు వస్తాయి. పని ప్రదేశంలో ఉరుకులు పరుగుల తో పని చేయాలి. ఎన్నో ఒత్తిళ్ళు , ఎన్నో డిమాండ్స్ అలాంటప్పుడు మన చుట్టూ స్నేహపూరిత వాతావరణం లేకపోతే ఎంత నష్టం. ఇప్పుడు తోటి వారి సాయం తీసుకోకపోవడం లో మొహమాటం వద్దు.ఎవరి మాట వినవలిసి వచ్చినా శ్రద్దగా వినాలి. చేసే పనిలో పూర్తిగా నిమగ్నం కావాలి. ఫోన్ నోట్స్ పక్కన పెట్టి మనస్పూర్తిగా శ్రద్దా వినే స్రూటగా వుండాలి. ఎప్పుడు  ఎదుటి వాళ్ళకు సాయం చేసే విషయంలో ముందుండాలి. అలా పరస్పర సహాయ సహకారాలు ఉంటేనే పని వత్తిడి తగ్గుతుంది. చుట్టూ వున్నవారి నైతిక మద్దత్తు ఎంతో శక్తిని ఇస్తుంది. ప్రసంశించె ధోరణి ఇతరుల్లో వుండే గోప్ప గుణాలను గుర్తించి ప్రోత్సహించే ధోరణి వుంటే అదే గొప్ప ఎస్సెట్ అయిపోయి మనల్ని అందరికీ సన్నిహితులులను చేస్తుంది. అందుకే సహ ఉద్యోగులతో సామరస్యంగా వ్యవహరించడం చాలా అవసరం.

Leave a comment