ఒక నవ్వే చాలు… అన్నారో సినీ కవి. నిజమే అందమైన మొకానికి చక్కని నవ్వు వజ్రాల నగలంత అందం. చక్కని నవ్వంటే ముత్యాల్ల మెరిసే పళ్ళతో నవ్వటం. ఆరోగ్యకరమైన తెల్లని దంతాలు కోసం కొన్ని జాగ్రతలు తప్పనిసరి. ప్రతి రోజు డి సెన్సిబుల్ టూత్ పేస్ట్ తో ఈ వర్షాకాలంలో పళ్ళు రుద్దుకోవాలి. చక్కర పదార్థాలు, ప్రాసేస్ద్ పుడ్స్, ప్రిజర్వేషన్స్ కి దూరంగా ఉండాలి. టూత్ బ్రష్ నెలకు ఒకసారైన తప్పనిసరిగా మార్చి తీరాలి. పోషకాలు సీజన్ కు తగిన డైట్ తీసుకోవాలి. భాధం, మొక్కజొన్న వంటివి తినాలి. చిగుల్ల బలం కోసం సి విటమిన్, యాంటిఆక్సిడెంట్ పుష్కలంగా ఉండే ఆహరం తీసుకోవాలి. పైనాపిల్, కీర వంటివి పళ్లకు ఆరోగ్యంగా ఉంచుతాయి. మరి వేడిగా ఉండే కాఫీ, టీ లు సోపులతో దంతాలు సున్నితత్వం దెబ్బతింటుంది. పళ్ళ డాక్టర్ ను కూడా కనీసం సంవత్సరానికి ఒకసారైనా సంప్రదించి దంతాల ఆరోగ్యుం గురించి శ్రద్ధ తీసుకోవడం మంచింది.
Categories