ఈ మధ్య కాలంలో సెలవులోస్తే ఎదో టూర్ వెళుతున్నామని లేదా అమ్మాయిలు వంటరి ప్రయాణాలు ఇష్టపడుతున్నామని, రిటైర్ అయిన వాళ్ళు ఇప్పుడు తీరికగా వున్నాము ఏదైనా కొత్త ప్రదేశాలు చూస్తున్నామని అంటున్నారు. ముందుగా ఇలాంటి పట్రప్ కయినా విలువైన నగలు తీసుకుపోవద్దు. ఎక్కువ సామాను సర్డుకుకోవద్దు. వెళుతున్న చోట వాతావరణం సరిపదుతుంది లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడు కావలసిన దుస్తులు , సామాన్లు చూసి ఎంచుకోవాలి. మొబైల్లో బ్యాటరీ  చార్జింగ్ ఎంత సేపు వుంటుంది చెక్ చేసుకోవాలి. చార్జర్లు తప్పనిసరిగా వెంట వుండాలి. ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళతో టాబ్ లో వుండాలి. ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళతో టచ్ లో వుండాలి. ఆరోగ్య సమస్యలుంటే వాడే మందులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ వెంట తీసుకువెళ్ళాలి. కొత్త చొట ఇవన్నీ దొరక్క పోవచ్చు. నీళ్ళ సీసాలు, దుప్పట్లు, ఐడెంటి కార్డులు ముందే చూసుకుని, అన్ని ప్రదేశాల గురించి సమాచారం తెలుసుకొని ప్రయాణం చేయాలి. అప్పుడే సెఫ్.

Leave a comment