శుబ్రమిన దుప్పటి, చక్కని తల దిండు వుంటే తప్పా చాలా మందికి నిద్ర పట్టదు. అందమైన దుప్పటి కంటే శుబ్రమైన దుప్పటి, దిండుకి ప్రాధాన్యత ఇవ్వాలి కుడా రోజు మర్చి రోజు దుప్పటి ఉతికి, ప్రతి రోజు దిండు ఎండలో వేస్తే ఆరోగ్యంగా వుంటుంది. వీటిని ధరించే దుస్తులతో సమానంగా చూసుకోవాల్సిందే. దిండు గాలేబీలను కుడా రెండు రోజులకి మార్చేయాలి. తలపియా జయుడు మురికి వంటివి దిందల కవర్ల నుంచి లోపలి దిగిపోతాయి. దిండుని ఏడాదికి తీసి పడేయడం మేలు. చల్లని రోజులు కనుక దిండు పై నల్లని మరకలు కనిపించినా తేమగా వున్నాయనిపించినా తీసేయాలి. దిండు ఒకే వైపున వుంచేస్తే ఫంగస్ వస్తుందేమో చూసుకుంటూ వుండాలి. శరీర శుబ్రతకి, చేసుకునే దుస్తులకి పడుకునే పడకకు, దిండ్లకు సమానమైన శ్రద్ధ చూపితేనే ఆరోగ్యంగా ఏ ఎలర్జీలు రాకుండా ఉంటాయి.

Leave a comment