సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిథ్దిర్భవతు మే సదా!

మాఘమాసం శిశిర ఋతువుకి    ఋతురాజు వసంతుడిని   ఆహ్వానించి,ప్రేమకు చిహ్నం మన్మథుడు,అనురాగవతియైన రతీదేవిని శ్రీ పంచమి నాడు తలచుకుంటూ భక్తులు భక్తిగా పూజలు చేయాలి.గోదావరి నది తీరాన తెల్లని పద్మంలో వీణా ధారియై ఆసీనురాలైన సరస్వతీ దేవి అవతారం బాసర సరస్వతీ దేవి.
శ్రీ పంచమి నాడు తెల్లని వస్త్రములు ,తెల్లని పూవ్వులతో సరస్వతీ దేవిని పూజించాలి.కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో పుస్తకంతో మనకు దర్శనం ఇస్తారు.అహింసకు అధినేత సరస్వతీ.సరః అంటే కాంతి.మేధ,ఙ్ఞానాన్ని,ధారణా శక్తులకు ఆద్యం పోసేది శారదా దేవి.వాగ్దేవీ,సిధ్ధ సరస్వతి,నీల సరస్వతి,మహా సరస్వతి గా మాఘ మాసంమలో వసంత పంచమి సరస్వతి దేవి జన్మ నక్షత్రంగా దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు భక్తులు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,తీపి పదార్థాలు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment