నల్గొండ జిల్లాకి రెండు కిలోమీటర్ల దూరంలో వున్న పాన్గల్లోని శ్రీ ఛాయా సోమేశ్వరుని దర్శనం చేసుకుని వద్దాం పదండి.

చోళుల రాజ్యంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి.ఇక్కడ శివలింగం పైన ఛాయ కనిపిస్తుంది,కానీ ఈ నీడ ఎటునుంచి పడుతోందో ఇంతవరకు శాస్త్రవేత్తలకు కూడా ఆచూకి లేదు.దగ్గరలో ఉదయ సముద్రం అనే చెరువులో 365 రోజులు నిరంతరం గంగమ్మ ప్రవహిస్తూనే ఉంటుంది.గర్భ గుడిలో వున్న శివయ్యని ఎల్లప్పుడూ గంగా జలంతో పూజిస్తూ వుంటుంది.ఈ దేవాలయానికి సమీపంలో అగ్రపూజ్యుడైన గణపయ్య,దత్తాత్రేయుని దర్శనం చేసుకోవాలి.సూర్య భగవానుడిని అతని సారథి అనిరుడిని కూడా దర్శనం చేసుకుని కటాక్షం పొందుదామా.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment