రామ్ రామ్ రామ్ సీతా…..

రామ్ రామ్ రామ్ సీత….

సుందరకాండ అంటే మనం భక్తితో స్మరించేది హనుమంతులవారిని. మనకు సదా అభయం ఇచ్చి మంచి-చెడులను చూపి కాపాడుతాడు.

ఉత్తర భారతదేశంలో తులసీదాస్ దోహే అంటే మనం హనుమాన్ చాలీసా అంటాము.సంత్ తులసీదాస్ శ్రీ రామచంద్రులవారికి పరమ భక్తుడు.వారణాసిలో స్థిరపడి ధ్యానం చేస్తూ సకల జనులకు తన వంతుగా సహాయ పడేవారు.ఒకరోజు బాద్షా తులసిదాస్ భక్తిని పరిక్షించాలని కోటకు రమ్మని ఆహ్వానించారు. ఆ పరీక్షలో గెలవటానికి తులసీదాస్ కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ వుంటే అదే సమయంలో వానర దండు ప్రత్యక్ష మైంది.కోట గుమ్మంలో వీరాంజనేయుల వారు ఆసీనులై ఉన్నారు. అది చూచిన బాద్షా తులసీదాస్ భక్తకి మెచ్చి సన్మానం చేశారు. హనుమంతులవారిని చూసి మైమరచి 40 దోహాలు అనర్గళంగా పాడారు.
అప్పటి నుండి హనుమాన్ చాలీసా/సుందరాకాండ/ తులసీదాస్ దోహే ప్రచారమైనాయి.
నిత్య ప్రసాదం: కొబ్బరి,గారెలు,అప్పాలు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment