గోదావరి జిల్లాలోని రావులపాలెం కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ర్యాలీ గ్రామంలో గల శ్రీ జగన్మోహిని చెన్నకేశవులను దర్శనం చేసుకుందామా?పురాణ గాథలు ప్రకారం శ్రీ మహావిష్ణువు అమృత మథనంలో జగన్మోహిని అవతార మెత్తి దేవతలకి అమృతాన్ని పంచుతాడు.నారదుల వారు ఈ విషయం శివునికి చెప్పిన శివుడు కూడా జగన్మోహినిని చూడాలని తహ తహ  లాడాడు. శ్రీమహావిష్ణువుని జగన్మోహినిగా చూసిన శివుడు అందుకోవడానికి ప్రయత్నించగా జగన్మోహిని అందకుండా పరిగెత్తే కాలంలో చూసిన ముందు భాగం శ్రీ మహావిష్ణువుగా వెనుక నుంచి జగన్మోహినిగా కనిపించి అక్కడే శిలా రూపంలో దర్శనం ఇస్తారు.భక్తులకు గర్భగుడిలోకి అనుమతిస్తారు.

నిత్యప్రసాదం:కొబ్బరి,పండ్లు,పులిహోర

             -తోలేటి వెంకట శిరీష

Leave a comment