సౌభాగ్యలక్ష్మి రావమ్మ…..అమ్మా….!!

విశాఖపట్నంలోని బుర్జుపేట లో ఉన్న శ్రీ కనక మహాలక్ష్మిని దర్శనం చేసుకుందాం పదండి!!పురాతన చరిత్ర గల దేవాలయ నిర్మాణం.ఈ ఆలయానికి గాలి గోపురాలు వుండవు.విశాఖ రాజులు అమ్మవారిని కొలిచి ఆ తల్లి చల్లని చూపులు ప్రసాదించమని పూజలు చేసేవారు.
శత్రువుల నుంచి అమ్మవారిని కాపాడుకునేందుకు ఒక బావిలో పెట్టారు.తరువాత కొన్ని రోజులకు ఆలయం కట్టించి ప్రతిష్ఠ చేశారు.శివుని శాపం వలన అమ్మవారికి వామ హస్తం లేదు.మార్గశిర మాసం ప్రత్యేకంగా ఉత్సవాలు జరుపుతారు.
భక్తులు తమ కోరికలు తీర్చే కనకమయీ అని తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు. అమ్మవారికి గురువారం, శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం.

          -తోలేటి వెంకట శిరీష

Leave a comment