హైదరాబాద్- సికింద్రాబాద్ సఖులు ఆషాఢమాసం గ్రామదేవతల పూజలతో నిమగ్నమై ఉన్నారనుకుంటా!!
ఈ రోజు మరి హైదరాబాద్- సికింద్రాబాద్ కి రక్షకురాలిగా లోయర్ టాంక్ బండ్లో వున్న శ్రీ కనకాల కట్ట మైసమ్మకి ప్రసాదం నైవేద్య పెట్టి అందరినీ చల్లగా చూడాలని మొక్కుదాం.
నవాబుల పరిపాలనలో హుస్సేన్ సాగర్ వద్ద వరదలకి అడ్డు కట్ట కడదామని ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు మరి అప్పుడు ప్రజల కోరిక మేరకు కట్ట మైసమ్మ కు ముడుపులు కట్టడం మొదలు పెట్టారు.వెంటనే అమ్మ కటాక్షంతో కట్టడం నిలచి అమ్మవారికి బోనంతో మొక్కలు చెల్లించేవారు.ఆషాఢమాసంలో ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరిస్తారు.
మైసమ్మ తల్లి గంగమ్మ తెప్పోత్సవం చూడచక్కని వేడుక. చాటలో చీర,పసుపు కుంకుమ,పూలు,గాజులు,మంగళ సూత్రం,మెట్టెలు,ఒడిబియ్యంతో హుస్సేన్ సాగర్ వద్ద వున్న గంగమ్మ కి సమర్పిస్తారు.
ఇష్టమైన పూలు: అన్ని రకాల పుష్పాలు అంగీకరిస్తుంది.
ఇష్టమైన పూజలు: ప్రతి మంగళవారం రక్తాక్షి రూపంలో ప్రత్యక్షమవుతుంది కావున మేక,యాటలను బలి ఇవ్వడం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,బోనంతో చద్ది నైవేద్యం పెట్టి చల్లని చూపుల శ్రీ కనకాల కట్ట మైసమ్మను పూజించి అనుగ్రహం పొందండి.
-తోలేటి వెంకట శిరీష