ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో కిలోమీటరు దూరంలో కేశవ పేటలో కొండ దిగువున పరమశివుడు, శ్రీ మహావిష్ణువు పక్క పక్కనే ఆలయాలలో కొలువై ఉన్నారు.

నాగలింగ వృక్ష పుష్పంలో తెల్లని బుడిప నాగపడిగ లాగ మనకు దర్శనం ఇస్తుంది.ఈ పుష్పాలు శివునికి ఎంతో ప్రీతికరమైనవి.పూర్వం ఒంగోలు రాజు రామచంద్రరాజు ఈ ప్రాంతంలో చెన్న కేశవ స్వామి ని ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించాడు కానీ కొద్ది రోజులకి శత్రు రాజ్యం నుండి రక్షణ కోసం స్వామివారి ఆలయాన్ని వేరొక స్థలంలో నిర్మించారు.శత్రు రాజ్యంలో వున్న భక్తుడు శివారాధనకు తన వంతుగా కాశి విశ్వేశ్వరుని ఆలయాన్ని నిర్మించారు.ఇలా ఈ ప్రాంతంలో కాశివిశ్వేశ్వరుడు,చెన్నకేశవుడు పక్క పక్కనే ఆలయాలలో భక్తులకు దర్శనం ఇస్తారు.

నిత్య ప్రసాదం:కొబ్బరి,అమృతాభిషేకం,పులిహోర,పొంగలి

-తోలేటి వెంకట శిరీష

Leave a comment