అతిలోక సుందరిగా ప్రసిద్ధ కెక్కిన ప్రముఖ నటి శ్రీ దేవి దుబాయ్ లో కన్నుమూసింది.  బంధువు వివాహ వేడుక సంధర్భంగా శ్రీదేవి కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్ళింది.   1963 ఆగస్ట్ 13న తమిళనాడులో జన్మించిన శ్రీదేవి  1967 నుంచి అంటే నాలుగేళ్ళ వయస్సు నుంచి సినిమాల్లో నటిస్తూనే ఉంది.   తెలుగు , తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించిన శ్రీదేవి  1979లో హిందీ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించింది.   అన్నీ భాషాల్లోనూ అందరు అగ్ర కథనాయకులతోనూ   ఆమె కలిసి నటించింది.   కేంద్ర ప్రభుత్వం 2013లో  శ్రీ దేవికి  పద్మ శ్రీ   పురస్కారాన్ని  ప్రదానం చేసింది.   ఆమె అందుకొన్న పురస్కారాలకు అంతే లేదు.   ఐదు దశాబ్దాల కెరీర్ లో వందలాది సినిమాల్లో నటించి మెప్పించిన శ్రీ దేవి హఠాన్మరణం అభిమానులను  శోకసంద్రంలో ముంచేసింది.

Leave a comment