మనం సినిమా పరిశ్రమకు చెందక పోతే చాలా అవకాశాలు వుండవు. ఎటువంటి కనెక్షన్లు లేకుండా వ్యక్తులను కలుసుకోవటం చాలా కష్టం. ఫిల్మ్ మేకర్స్ కు వారిని కలుసుకోవాల అనుకుంటున్నామని పదే పదే సందేశాలు పంపాలి కొన్ని సార్లు వాళ్ళు అస్సలు స్పందించరు కూడా తోలి ప్రాజెక్టును అందుకోవటమే చాలా కష్టం అయిపోతుంది అంటోంది కృతి సనన్ . ఎటు వంటి సినీ నేపద్యం లేకుండా సినిమాల్లో నిలదొక్కుకోవటం చాలా కష్టం అదే స్టార్ కిడ్ అయితే మొదటి సినిమా రాకముందే పేరు పాపులర్ అవుతోంది. లైఫ్ లో ఏం చేయాలన్నది ముందే నిర్ణయం తీసుకోలేము కాస్త ప్రయాణం జరిగాక గానీ అది అర్థం చేసుకోలేకపోతాము టి.వి. కమెర్షియల్,ప్రారంభం అయ్యాక నటనా నైపుణ్యానికి మెరుగులు పెట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది కృతి సనన్ .

Leave a comment