తెలంగాణ యాసలో కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడడం నా నైజం అలా మాట్లాడతాననే మా ఊరి పిల్లలు తీసే ‘ మై విలేజ్ షో ‘ యూట్యూబ్ వీడియో లో అవకాశం ఇచ్చారు. 71 వీడియోలతో ఈ షో ద్వారానే ఎంతో గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మా పల్లె నుంచి జాతీయ స్థాయి వరకు యూట్యూబ్ స్టార్ అంటున్నారు. పాత గంగవ్వ కాస్త సినిమా స్టార్ ని అయిపోయానా అంటుంది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన గంగవ్వ మహిళా దినోత్సవం రోజున గవర్నర్ తమిళ సై నా నటనకు అవార్డ్ ఇచ్చారు ఏది వచ్చినా, ఎందురు  మెచ్చుకున్న నేను గంగవ్వ లాగే ఉంటాను. సినిమా అవకాశాలు వస్తే చేస్తాను లేదా ఊర్లో వ్యవసాయ పనులకు వెళ్తాను ఎంతైనా నా రెక్కల కష్టం పైనే ముందుకు వెళ్తా అంటుంది గంగవ్వ.

Leave a comment