చాలా సినిమాల్లో నటిస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు కాజోల్ కూడా చక్కని క్లారిటీతో అగ్ర హీరోల సరసన నటించేటప్పుడు హీరోయిన్లు పారితోషకాల విషయంలో కాస్త ఫ్లెక్సిబుల్ గ వుంటారట. మనతోటి యాక్టర్స్ ఎవరైనా దానిపై కొన్ని సౌకర్యాలు ఉంటాయి అంటోంది కాజోల్.స్టార్స్ తో సినిమాలు అంటే చాలా లాభాలున్నాయి. కాల్షీట్లు విలువైనవి కనుక అనుకొన్న సమయానికి అన్నీ పూర్తవుతాయి. సినిమా దాదాపు బాగానే ఆడుతుంది కనుక అందరికీ చక్కని పేరు వస్తుంది. బోలెడన్ని అవకాశాలు వస్తాయి. హీరోయిన్స్ చిన్న చిన్న పొరబాట్లు ఎవ్వరూ పట్టించుకోరు. పెద్ద సినిమా అయితే మనం ఆలోచించనక్కర్లేదు. ప్రమాణాల విషయంలో ప్రొడ్యూసర్సే ఎంతో శ్రద్ధగా వుంటారు. కనుక నేనయితే ఆలోచించకుండా ఎస్ అనేస్తాను అంటోంది కాజోల్. తనను పొగుడుకోకుండా ఎంత నిజాయితీగా చెప్తుందో కదా కాజోల్. ఇంత వినయంగా వుంది కనుకనే ఎన్నో అవకాశాలు.

Leave a comment