లాక్ డౌన్ లో బ్రేకప్ కాన్సెప్ట్ పైన ఒక రీల్ చేస్తే పది లక్షల మంది చూశారు. హాస్యం ఎంచుకొని నిహారిక ఎన్. ఎం చేస్తున్నా వీడియోలను 22 లక్షల మంది చూస్తారు.  ఆమె ఫాలోవర్స్ రకుల్, రెజీనా, ఖుష్బూ వంటి వాళ్లు ఉన్నారు. ఇన్ స్టా లో పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న నిహారికతో ఇప్పుడు మహేష్ బాబు, హీరో యష్, అజయ్ దేవగన్, షాహిద్ కపూర్ కూడా ఆమెతో రీల్స్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ లు చేస్తున్నారు. సర్కారు వారి పాట కోసం మహేష్ బాబు తో చేసిన రీల్ ట్రెండ్ సృష్టించింది. రాత్రికి రాత్రే స్టార్ అవ్వడం ఒక నిహారిక కు చక్కగా సరిపోతుంది. రెండు నెలల్లో లక్షల మంది చూసే ఆమె ఇన్ స్టా 10 లక్షలకు చేరింది. స్టార్స్ కూడా ఆమె డేట్స్ కోసం చూస్తున్నారంటే ఆశ్చర్యం ఏముంది !

Leave a comment