అంతరిక్షంలో ప్రయాణం అనగానే వ్యోమ గ్రాములు కళ్ళముందు కనిపిస్తారు. సామాన్యులకు వాళ్లని చూసే అవకాశం ఉండనే ఉండదు. కానీ కెల్లీ గెరార్డి అనే టిక్ టాకార్ స్పేస్ షిప్ లో ప్రయాణం చేసే అవకాశం దక్కించుకుంది వచ్చిన గెలాక్టివ్ అనే అంతరిక్ష టూరిజం సంస్థ వచ్చే ఏడాది నుంచి మనుషుల అంతరిక్ష పర్యాటకానికి సిద్ధం చేస్తోంది. ఆదిశగా పరిశోధనలు మొదలయ్యాయి. ఇందుకోసం కెల్లీ గెరార్డి ని ఎంపిక చేశారు. ఈమె ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోనాటికల్ సైన్సెస్ లో ఆస్ట్రోనాటిక్స్, స్టెమ్ అంశాలతోపాటు తల్లిగా తన అనుభవాలను టిక్‌టాక్, ఇన్‌స్టాలలో పోస్ట్ చేస్తుంటుంది ఆమెకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. స్పేస్ టూరిజం పైన ఆసక్తి, వర్చువల్ గా ఆమెకు ఫాలోయింగ్ ఉండటం వల్ల ఆమె ఎంపికైంది. కెల్లీ అంతరిక్షంలో వెళ్ళాక సున్నా గ్రావిటీ లో ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో శరీరం బరువు తో శరీరంలో వచ్చే మార్పులకు సంబంధించి బయోమెట్రిక్ డేటా సేకరిస్తారు. వీటి ఆధారంగా స్పేస్ ఫ్లైట్ల ను ఆధునీకరించేందుకు వీలవుతోంది. 32 కెల్లీ ఇప్పటికే స్పేస్ స్టేషన్ లో శిక్షణ తీసుకుంది. ఆమె ప్రయాణం తర్వాత ఇక భవిష్యత్తులో ఎంతో మందికి స్పేస్ షిప్ లో అంతరిక్షంలో విహరించే అవకాశం వస్తుంది.