స్టార్ట్ ప్ ప్రారంభించాలనుకునేవాళ్ళు ఇప్పుడు ఆనర్ఘ్య వర్ధన వైపు చూడచ్చు. అంకురా పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టి వాటి లాభాల్లో వాటా పొందాలనుకునే వెంచర్ క్యాపిటల్ సంస్థలున్నాయి. వాటి దగ్గర డబ్బు ఉంటుంది. దాన్ని ఏ సంస్థలో పెట్టుబడి పెట్టాలి ఏ రంగాన్ని ప్రోత్సహించాలి అన్న అంశాల పై సంస్థని నడిపించే వ్యక్తులే ఈ పెట్టుబడి సారధులు. ఆనర్ఘ్య ఆపని చేస్తోంది. ఆమె రాధన్ బర్గ్ అనే సీసీ  సంస్థలో ఉన్నపుడు 88 కోట్ల రూపాయలను వర్చువల్ రియాలిటీ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టించింది. ఇందులో పాతిక శాతం సంస్థలు మహిళలు నడిపేవే. ప్రస్తుతం మెవ్రాన్ అనే సంస్థలో సీనియర్ అసోసియేట్ గా పనిచేస్తోంది. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలుగా చెపుతున్న ఎఆర్ 3డీ ప్రింటింగ్ డాన్స్ వినియోగాలపై ఇప్పుడీమె  దృష్టి పెట్టింది. గుగూల్ లో పనిచేసిన ఆనర్ఘ్య డి కర్ణాటక ప్రాంతం. తండ్రి ఇంజినీరు అమెరికాలో ఉంటున్నారు . ఆనర్ఘ్య అక్కడే పుట్టి ప్రఖ్యాత స్టాన్ ఫార్ట్ విశ్వవిద్యాలయం లో చదువుకుంది. ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన యువతిగా ఈమెను గుర్తించింది.

Leave a comment