నిరంతరం నైపుణ్యాలు మెరుగుపరచుకోండి, సాంకేతిక వ్యవహార పరంగా వచ్చే మార్పులను తెలుసుకోండి. నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడే విజయ ప్రస్థానం కొనసాగుతుంది అంటుంది శ్రేయసి. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన శ్రేయసి స్నేహితుడు ప్రథమ్ రాజ్ తో కలిపి ఢిల్లీ కేంద్రంగా హరప్పా ఎడ్యుకేషనల్ స్టార్టప్ మొదలుపెట్టింది ఔత్సాహిక వ్యాపార వేత్తలకు నైపుణ్యాలు నేర్పిస్తోందీ సంస్థ. లక్ష మందికి పైగా ఈ సంస్థలో చేరారు 3.5 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు వ్యాపార నైపుణ్యాల పైన 35 కోర్స్ లు  యాప్ సైట్ లలో అందిస్తోందీ సంస్థ.

Leave a comment