Categories
Nemalika

స్థిత ప్రజ్ఞతకు మరోరూపం ఆత్మవిశ్వాసం.

నీహారికా,

తరచుగా ఆత్మవిశ్వాసం అన్న పదం వాడుతూ వుంటారు. దీనితో దేన్నయినా జయించవచ్చు అని. నిజమే అంటే మనపైన మనకు ఎంత విలువ, ఇష్టం గౌరవం వుంటే అంత ఆత్మవిశ్వాసం ఉంటుందని. ఈ విశ్వాసం పెంచుకోగలం కూడా. ఎలా అంటే మన అభిప్రాయాలు, విశ్వాసాల పట్ల మనకు నమ్మకం ఉండాలి. మనల్ని మనం విమర్శించుకోవడం తగ్గించుకోవాలి. లక్ష్యాలు ఉండాలి కానీ మరీ అందుకోలేనంత ఎత్తున పెట్టుకోకూడదు. సౌందర్య పోషణ చాలా అవసరం. మన రూపం, వస్త్రధారణ మనపైన మనకు నమ్మకం ఉండాలి. ఎప్పుడూ ఇతరులతో పోలిక తెచ్చుకోకపోతే సగం పని పూర్తయినట్లే. సాయపడే తత్వం ఉండాలి. ఇతరులకు సాయపడగలిగితే మెదడులో అనుకూలమైన భావాలు కలుగుతాయి. ప్రవర్తన తీరు మారిపోతుంది కనుక సామాజికమైన సపోర్ట్ దొరుకుతుంది. స్నేహితులూ, బందువుల సపోర్ట్ తో సామాజిక సంబందాలు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి. జీవితంలో వరసగా ఎదురైన వైఫల్యాలు, సమస్యల వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినిపోతూవుంటుంది. అలాంటప్పుడు నిలబడే ప్రయత్నం తోనే ఆత్మవిశ్వాసం రెట్టింపుగా అవుతుంది. మన మోహంలో అది ప్రతిఫలిస్తుంది. మనిషిలో కనిపించే హుందాతనం, స్థిమితం, స్థితప్రజ్ఞత ఇవన్నీ ఆత్మవిశ్వాసపు లక్షణాలే.

Leave a comment