పిల్లల్ని కుటుంబాన్ని శ్రద్ధగా కాపాడుకునే స్త్రీ ప్రకృతి లోని జీవరాశిని కాపాడటం లోనూ ముందుంటుంది. అందుకే సేంద్రియ వ్యవసాయం లో ఆమె బాగా వర్క్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆహారం వ్యవసాయ రంగంలో మహిళల శాతం అధికమే ప్రకృతి శక్తి, స్త్రీ శక్తి స్వరూపిణి. ఈ శక్తిని విడదీయలేం అందుకే ప్రకృతి రక్షణకు స్త్రీలే ఎక్కువ పని చేస్తారనుకుంటాను అంటారు పర్యావరణ వేత్త రచయిత, సామాజిక కార్యకర్త వందనా శివ. వ్యవసాయ రంగంలో స్త్రీ శక్తి పెరిగింది అంటారు దేశీ విత్తన సేకరణ కోసం నవధాన్య సంస్థను స్థాపించారు. దేశమంతా ప్రాంతీయ విత్తన బ్యాంక్ ల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు జీవన వనరుల వైవిధ్యం స్థానిక విత్తనం సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించేందుకు 1982 లో రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ స్థాపించారు. ప్రతిష్టాత్మక రైట్ లైవ్లీ హుడ్ అవార్డు అందుకున్నారు.

Leave a comment