జిందాహై టైగర్ లో బోలెడన్ని యాక్షన్ సీన్లు ఈ జీగా చేసేసిండి కత్రీనా కైఫ్. ఇంత సుకుమారంగా వుంటూ పోరాటాలు ఎలా చేసారు అని అడిగితే స్త్రీలకు పోరాటాలు కొత్తకాదు. పుట్టినప్పటినుంచి, చనిపోయే వరకు ఎన్నో పోరాటాలు చేస్తారు. పురాణాల్లోనే కత్తి పట్టి యుర్ధం చేసిన వీరనారీలు ఎంతో మంది కనిపిస్తారు. వాళ్ళ ముందు నేనెంత అంటూ నవ్వేసింది కత్రీనా. అసలు పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ పోరాడగలరు. శక్తి మంతులు కుడా కానీ స్త్రీ ల శక్తి బయటి ప్రపంచం గుర్తించదు. ఇక సినిమాలో నంటారా కొంతకాలం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ఈ సినిమాలో నా యాక్షన్ సన్నివేశాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నా శ్రమ ఫలించింది. అంటుంది కత్రీనా. ఈ సంవత్సరం బాగా గడిచింది. కొత్త సంవత్సరంలో మూడు సినిమాలు విడుదల అవుతాయి అని చెప్పింది కత్రీనా సంతోషంగా.

Leave a comment