వృత్తి జీవితం లో ఒత్తిడి తగ్గాలంటే కాసేపు పెట్స్ తో గడిపితే కొత్త ఉత్సాహం వస్తుంది అంటున్నారు సైకాలజిస్ట్ లు. వాటికి చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఎదుటివారి మనసెరిగి ప్రవర్తిస్తాయి.పెంపుడు జంతువులతో గడిపితే మనిషి శరీరంలో సెరటోనిన్ డోపమైన్ లెవెల్స్ పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. అవి ఒత్తిడిని ఆందోళనను దూరం చేస్తాయి. పెట్స్ ను ముట్టుకోవటం, హత్తుకోవటం ద్వారా ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు. పెట్స్ ను పెంచుకునే వారి జీవన విధానం కూడా ఆరోగ్యకరంగా ఉంటుందని ఒక పరిశోధన చెబుతోంది.

Leave a comment