లాక్ డౌన్ లో వర్క్ ఫ్రం హోమ్ లతో ఒత్తిడి గురవుతున్న యువతను గార్డెన్ మెడిటేషన్ చేయండి కాస్త విశ్రాంతి గా చురుకుగా ఉంటారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కాసేపు అలా పెరటి తోటలోనో, ఇంట్లోనో సిటవుట్లో ఉండే పది పూల కుండీల మధ్య కాసేపు గడప మంటున్నారు .హైటెక్ జీవితంలో వేగాన్ని వత్తిడిని తట్టుకునేందుకు మనస్సును శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుకునేందుకు ఈ గార్డెన్ మెడిటేషన్ చాలా ఉపయోగం .కాసేపు కళ్ళు మూసుకొని పచ్చని పచ్చిక మధ్య శరీరాన్ని మనసుకి ఏకం చేసి తదేక దృష్టితో చేసే ధ్యానమే గార్డెన్ మెడిటేషన్. శరీరానికి ప్రకృతి సిద్ధంగా సూర్యరశ్మి నుంచి అందే పోషకం విటమిన్ డి .ప్రతి ఉదయం సూర్యుని కిరణాలు నేలపైన పడే వేళలో  ఆ ఎండ పడే చోట ,అదీ పెరటి తోట ఉంటే అక్కడ కూర్చుని ధ్యానం చేస్తే ఆ విటమిన్-డి శరీరానికి అందుతుంది. పెరటి తోట లేకపోతే నివాసం ఉండే ఇల్లయినా సరే చుట్టూ చక్కగా ఆక్సిజన్ ఇచ్చే ఇండోర్ ప్లాంట్స్ కుండీల్లో పెంచుకొని దాన్నే మెడిటేషన్ కు ఉపయోగించుకోవచ్చు.ధ్యానం, ఆందోళన, కుంగుబాటు ల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది .ఇదంతా లేదా మనస్సే ఒక ఉద్యానవనం చుట్టూ సువాసన భరితమైన ఉద్యానవనం ఉందని ఊహించుకుంటూ ప్రతి పువ్వును అనుభవంలోకి తీసుకుంటూ మనసులో మంచి ఆలోచనలు పెంచుకోవచ్చు మానసిక ఆరోగ్యం మానసిక దృఢత్వాన్ని తీసుకువస్తుంది. ఎలాంటి సమస్యలనైనా తేలికగా పరిష్కరించుకో గలుగుతారు .కాలంతో పరుగు తీసే వారికి రోజుకు అరగంట విశ్రాంతి కావాలి. అలా విశ్రాంతి గా ధ్యానం చేయటం అలవాటు చేసుకుంటే చాలు !

Leave a comment