హెలెన్ కెల్లర్ రాసిన ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ చదివితే పరిస్థితులు అనుకూలించక పోయినా శారీరకంగా ఎన్నో పరిమితులు ఉన్నా మనిషి ఎంత ఎత్తుకు ఎదగలరో అర్థమవుతుంది. 1880 లో అలబామా లో పుట్టిన హెలెన్ కెల్లర్ 13 నెలల పసి బిడ్డ గా ఉన్నప్పుడే స్కార్లెట్ జ్వరము తో చూపు వినికిడి శక్తి దెబ్బతిన్నాయి. అన్ మాన్స్ ఫీల్డ్ సలీవాన్ అనే టీచర్ ఆమెకు శిక్షణ ఇచ్చింది స్పర్శతో నేర్చుకో గలిగే బ్రెయిలీ లిపి ఎంతో వేగంగా మాట్లాడే హెలెన్ కెల్లర్ బహిరంగంగా సమావేశాల్లో మాట్లాడే సమయంలో ఒక దుబాసి అవసరమయ్యే వాడు. విద్యావేత్తగా చందాలు వసూలు చేసే కార్యకర్తగా ఆమె విపరీతమైన ప్రభావం చూపెట్ట గలిగేది. ఆమె స్థాపించిన సంస్థ దృష్టి, ఆరోగ్యం పోషణ పరిశోధనలకు అంకితం చేసింది. మార్క్ ట్వైన్, చార్లీ చాప్లిన్ వంటి ప్రసిద్ధ వ్యక్తులు ఆమె స్నేహితులు. ప్రపంచాన్ని చూసిన హెలెన్ కెల్లర్ కంటే గొప్ప స్ఫూర్తి దాతలు ఇంకెవరైనా ఉంటారా.  ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు అడుగు వేయడం విధానం  లక్షణం !
చేబ్రోలు శ్యామ్ సుందర్ 
9849524134  
 

Leave a comment