నీహారికా,
చాలా కోపమేచ్చె రిపోర్ట్ ఒక్కటి వచ్చింది. ఈ అధ్యాయినం ఇరవై రెండు దేశాలకు చెందిన 18 వేలమందితో నిర్వహించారు. ఇందులో తమ అభిప్రాయం చెప్పిన వారిలో స్త్రీలు, పురుషులు కుడా సమానంగానే వున్నారట. మొత్తంగా తేల్చేది ఏమిటంటే స్త్రీలు ఎంత పెద్ద హోదాలో వున్నా సరే, ముందుగా ముందుగా పిల్లల్ని కనడం పెంచడం మాత్రమే ప్రధాన భాద్యత అని చెప్పారట. మిగతావన్నీ తర్వాత మాటే. మేనేజర్ కావచ్చు. చిరుద్యోగి కావచ్చు. వీటన్నింటి కన్నా పిల్లలు కనడానికే పనికొస్తారట ఆడవాళ్ళు. వాళ్ళను సాకి సంరక్షించే పాత్రకే వంద శాతం పనికి వస్తారట ఆడవాళ్ళు. ఎంత మంది పై కోపగించుకోవాలి. మన దేశాలో వందకి అరవైనలుగు శాతం అభిప్రాయం ఇదే. ఇప్పుడు పుబ్లిక్ అఫైర్స్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన గ్లోబల్ ట్రెండ్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలివి. ప్రపంచం మొత్తం స్త్రీలను ఉద్యోగం, వ్యాపారంలో ప్రోత్సహిస్తున్నారు కానీ సాంప్రదాయ ఆలోచలన రీతిని వాదులుకొలేకపోతున్నారు.